Shakuntalamma and Venkateshwara Rao
About
Early Life and Background
మానవ హక్కుల యోధుడు గొర్రెపాటి మాధవ రావు గారు మార్చ్ 4, 1957 న శకుంతలమ్మ, వెంకటేశ్వర రావు దంపతులకు గుర్నాథ్ పాలెం, రేపల్లె తాలూకా, గుంటూరు జిల్లాలో జన్మించారు. మొత్తం ఆరుగురు అన్నదమ్ముల లో మూడవ వాడు. అన్నలు జగదీశ్వర రావు, లీల మోహన్ రావు తమ్ముళ్లు శరత్ చంద్ర బాబు, యోగానంద్, రామకృష్ణ ఒక చెల్లి వసంత లక్ష్మి ఉంది. తనకు భార్య మీనా సహానీ కూతుర్లు మానస, ఆదిత్య మధుమిత్ ఉన్నారు. వారి తల్లిదండ్రులు 1957, జూన్ లో తెలంగాణ కు వలస వచ్చారు. బస్వాపూర్ గ్రామంలో స్థిరపడ్డారు. బాల్యం ప్రాథమిక విద్యాభ్యాసం ఎత్తొండ లో జరిగింది. హై స్కూల్ విద్య కోటగిరి లో జరిగింది. అక్కడే PDSU (Progressive Democratic Students Union) నిర్మాత JCS ప్రసాద్ తో పరిచయం అయ్యింది. తర్వాత ఇంటర్మీడియట్ విద్య బాన్సువాడ లో జరిగింది ఆ సందర్భంలోనే ప్రగతిశీల ఉద్యమాల గురించి నిరంతరం చర్చించేవారు. తదనంతరం ఉన్నత విద్య కోసం హైదరాబాద్ సిటీ కాలేజీ లో చేరారు. ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీ లో లాయర్ విద్యను అభ్యసించారు.
Legal Career and Involvement in Social Movements
అదే సమయంలో ప్రగతిశీల ఉద్యమాలలో భాగస్వామి అయ్యారు. PDSU మాస పత్రిక విజృంభణ, CPI(ML) పక్ష పత్రిక విమోచన పత్రికలకు సంపాదక వర్గంగా 3 సం. ల పాటు పూర్తికాలం పనిచేసారు. తదనంతరం కొంతకాలం టాక్స్ కన్సల్టెంట్ గా పనిచేసి. ఆ వృతిని వదిలేసి 1982 లో నిజామాబాద్ చేరి లా ప్రాక్టీసు మొదలుపెట్టారు. అనేక ఉద్యమ కేసులను ఉచితంగా వాదించారు. తెలంగాణ ఉద్యమంలో కూడా విద్యార్థులపై పెట్టిన కేసు లను ఉచితంగా వాదించి ఉద్యమానికి సహకారంగా ఉన్నారు. లాయర్ గా మూడు పోలీసు ఎన్కౌంటర్ లలో పోలీసు లపై, ప్రభుత్వం పై కేసు లను వేసి గెలిచి న్యాయస్థానం తీర్పుతో బాధితులకు ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం అందించారు. మరొక వ్యక్తిని దొంగతనం కేసులో పట్టుకొని పోలీసు లు బూటకపు ఎన్కౌంటర్ చేస్తే బాధితుల తరపున కేసు వాదించి గెలిచారు. లక్ష రూపాయలు బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని కోర్టు తీర్పు ఇస్తే, ప్రభుత్వం పై కోర్టు కు వెళ్ళినా అక్కడా గెలిచి బాధితులకు పరిహారం అందేలా చేశారు.
ద్వారకా నగరం గుడిసె వాసుల పట్టాల కోసం వారి తరపున కేసు లు వాదించి గెలిచారు. శ్రామిక నగర్ గూడెం భూముల పట్టాల కోసం కేసు వేసి గెలిచారు. కోటగల్లి వాసుల పక్కా ఇళ్లు పోరాటంలో వారికి మద్దతు తెలిపి, కేసు వేసి పట్టాల సాధనలో ముఖ్య పాత్ర పోషించారు. ఉద్యమకారులపై పెట్టిన ఔరంగాబాద్ కుట్ర కేసు వాదించి గెలిచారు. రాజ్య హింస ఎక్కడ జరిగినా ఎదిరించటంలో ముందు ఉండేవారు.
Commitment to Human Rights and Public Movements
కేసులు వాదించటంలో అందె వేసిన చెయ్యి. వాదించిన చాలా కేసు లు తన అపార ప్రతిభతో గెలిచారు. తన ప్రతిభకు కోర్టు లో ప్రభుత్వ ప్లీడరు గా అవకాశం వచ్చినా తిరస్కరించి నేను నిరంతరం బాధితుల తరపున వాదిస్తానని అన్నారు. తన వృత్తి తో పాటు నిరంతరం ప్రజా ఉద్యమాలకు సహకరిస్తూ వచ్చారు. అందులో భాగంగా హక్కుల ఉద్యమంలో పని చేశారు. పౌరహక్కుల సంఘం లో చేరి జిల్లా అధ్యక్షులు గా రాష్ట్ర సహాయ కార్యదర్శిగా 1983 నుంచి 1996 వరకు పని చేసారు. మరో హక్కుల నేత బాలగోపాల్ గారితో కలిసి 2004 నుంచి మానవహక్కుల వేదికలో భాగస్వామ్యం అయ్యి రాష్ట్ర అధ్యక్షులుగా ఎదిగారు. తెలంగాణ రాష్ట్ర మొదటి అధ్యక్షుడిగా 2019 నుంచి పనిచేసి 2023 లో రిలీవ్ అయ్యారు. హక్కుల హననం జరిగిన ప్రతి చోటా నిజనిర్ధారణ చేసి రిపోర్ట్ లు రాశారు.
Contributions to Education and Social Causes
నిజామాబాద్ లో జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ స్మృతిలో ఏర్పాటు చేసిన ట్రస్ట్ కి మేనేజింగ్ ట్రస్టీ గా ఉన్నారు. అనేక పత్రికలకు వ్యాసాలు,పుస్తకాలు రాశారు. అనేక ప్రజా సంఘాల కార్యకర్తలకు తరగతులు బోధించారు. తెలంగాణ యూనివర్సిటీ లో మొదటితరం న్యాయశాస్త్ర విద్యార్థులకు తరగతులు బోధించారు. నిజామాబాద్ లో మెడికల్ కళాశాలకు పార్థివ దేహాలను ఇవ్వటంలోనూ, అవయవ దానం చేయించటంలోనూ ముఖ్య పాత్ర పోషించారు.అనువాదంలో తను దిట్ట. అనేక రచనలు చేశారు. తన రచనలు పదునైనవి మరియు అచ్చ తెలుగు భాష లోనూ, ఇంగ్లీష్ భాషలోనూ చాలా పరిజ్ఞానం కలవారు.
Major Works
1. ఆచరణలో గతి తర్కం(డిడి కోశాంబి రాసింది తెలుగు అనువాదం)
2. కార్మిక చట్టాలు
3. ఆధునిక చైనా విప్లవం
4. విశ్వమానవ హక్కుల ప్రకటన (తెలుగు సేత)
5. జాతీయత లేని జాతీయ కాంగ్రెస్ - తెలుగు అనువాదం
Legacy and Loss
మాధవరావు గారి మరణం హక్కుల ఉద్యమానికి, ప్రజా ఉద్యమాలకు తీరని లోటు అని పలువురు వ్యక్తం చేసారు

Gorrepati Madhava Rao
JCS Prasad Memorial Trust
Born
04 March 1957
Died
28 December 2024
Citizenship
Indian
Occupations
Human Rights Activist, Lawyer, Writer, Translator
Years active
1982 - 2024
Known for
-
Prominent Human Rights Activist
-
Free Legal Aid for Victims
-
Defending Activists and Fighting Against State Violence
-
Translating Notable Works into Telugu
Political party
CPI (ML) (Associated during his early years with progressive movements)
Spouse
Meena Sahani
Children
Parents
Manasa, Aditya Madhumith
Shakuntalamma, Venkateshwara Rao





